: ‘అనంత’లో కిరాయి నరహంతక ముఠా అరెస్ట్... భారీగా మారణాయుధాల సీజ్
ఫ్యాక్షన్ హత్యల ఖిల్లా అనంతపురం జిల్లాలో కిరాయి హత్యలకు పథకం వేసిన నరహంతక ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో వరుస హత్యలకు సదరు ముఠా పక్కాగా స్కెచ్ వేసిందన్న సమాచారం ప్రస్తుతం జిల్లాను వణికిస్తోంది. ఈ ముఠాకు సంబంధించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ముఠాలోని 11 మంది సభ్యులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యుల నుంచి రెండు కార్లు, నాలుగు టిప్పర్లతో పాటు కత్తులు, తపంచాలు, వేట కొడవళ్లు తదితర మారణాయుధాలను భారీ సంఖ్యలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.