: తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి విద్యార్థి సంఘాల విఫలయత్నం


హైదరాబాదులోని తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు చేసిన ప్రయత్నం విఫలమైంది. తక్షణమే కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సమయంలో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి నేతలను అరెస్టుచేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు జూనియర్ కళాశాలల బంద్ కు ఎన్ఎస్ యూఐ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే విద్యార్థి సంఘాలు క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించారు.

  • Loading...

More Telugu News