: ఐరాస ఎగ్జిబిషన్ లో సత్యజిత్ రే ఛాయా చిత్రం


ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో భారతదేశ ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే ఛాయా చిత్రాన్ని కూడా ఉంచారు. ఐరాస దేశాల '2015-టైమ్ ఫర్ గ్లోబల్ యాక్షన్' క్యాంపైన్ లో భాగంగా ఈ ప్రదర్శనను నిర్వహించారు. మానవత్వానికి తమ వంతు కృషి చేసిన 16 మంది ప్రపంచ ఆలోచనాపరులు, కళాకారుల ఫోటోలను ఈ ప్రదర్శనలో ఉంచారు. 1992లో దేశం నుంచి తొలిసారి గౌరవ ఆస్కార్ పొందిన రే... అదే ఏడాది దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను అందుకున్నారు. ఈ ప్రదర్శనలో ఇంకా పాకిస్థాన్ హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మలాల యూసఫ్ జాయ్, పలు దేశాలలోని ప్రముఖ వ్యక్తులు, నటుల ఫోటోలను ఏర్పాటు చేశారు. ప్రజల సందర్శనార్థం ఈ నెల 30 వరకు ఈ ప్రదర్శనను ఉంచనున్నారు.

  • Loading...

More Telugu News