: పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రికి అదనపు విమాన సర్వీసులు


గోదావరి పుష్కరాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి హైదరాబాద్ నుంచి అదనంగా రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం జెట్ ఎయిర్ వేస్ రెండు సర్వీసులు, స్పైస్ జెట్ ఒక సర్వీసు నడుపుతున్నాయి. పుష్కరాల రద్దీ దృష్టిలో పెట్టుకుని ఈ రెండు సంస్థలు అదనంగా ఒక్కో సర్వీసును అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాయి. కొన్ని రోజుల్లో ఆ సర్వీసులను ప్రారంభించనున్నట్టు రాజమండ్రి విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదనరావు తెలిపారు.

  • Loading...

More Telugu News