: సినీ నటుడు ధనుష్ కు కోర్టు సమన్లు
తమిళ హీరో ధనుష్ కు చెన్నైలోని ఎగ్మూర్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇటీవల విడుదలైన ధనుష్ కొత్త చిత్రం 'కాక్కముట్టై'లో న్యాయవాదులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయంటూ అఖిలభారత న్యాయవాదుల సంఘ పరిరక్షణ సంఘం అధ్యక్షుడు మణివన్నన్ పిటిషన్ వేశాడు. దానిపై ఎగ్మూర్ మేజిస్ట్రేట్ మురుగన్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరపున నమోనారాయణ అనే న్యాయవాది వాదనలు వినిపిస్తూ, భారతీయ శిక్షాస్మృతి ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆ సినిమా నిర్మాతలైన ధనుష్, దర్శకుడు వెట్రిమారన్, ఈ చిత్ర దర్శకుడు మణికంఠన్ లకు సమన్లు జారీ చేసింది.