: ఈసారి కేఎస్ఆర్టీసీ వంతు...‘అనంత’లో బోల్తా పడ్డ వోల్వో బస్సు, 18 మందికి గాయాలు


హైదరాబాదు-బెంగళూరు జాతీయ రహదారిపై నేటి తెల్లవారుజామున మరో వోల్వో బస్సు బోల్తా పడింది. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం మక్తాపురం సమీపంలోని శివాలయం వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎఎస్ఆర్టీసీ)కి చెందిన వోల్వో బస్సు ఈ ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో బస్సులో ఉన్న మొత్తం 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

  • Loading...

More Telugu News