: రోమ్ లో దొరికిన పెషావర్ బాంబర్
పెషావర్ బాంబు దాడికి పాల్పడిన నరహంతకుడు ఇటలీలోని రోమ్ లో పోలీసులకు పట్టుబడ్డాడు. ఇటలీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 2009లో పాకిస్థాన్ లోని పెషావర్ లో రద్దీగా ఉండే మార్కెట్ లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దుర్ఘటనలో చిన్నారులు, మహిళలు సహా 134 మంది మృత్యువాత పడ్డారు. పాకిస్థాన్ లో జరిగిన ఉగ్రవాద ఘటనల్లో ఇది అత్యంత క్రూరమైన ఘటనగా అక్కడి ప్రజలు అభివర్ణిస్తారు. అంతటి దారుణానికి పాల్పడిన దుండగుల్లో ఒకడు ఇటలీలోని రోమ్ వీధుల్లో సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.