: ఉత్తరాఖండ్ లో తెలుగువారు చిక్కుకుపోవడంపై సీఎం చంద్రబాబు ఆందోళన


ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తెలుగు యాత్రికులు చిక్కుకుపోవడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. వారి పరిస్థితి పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ తో మాట్లాడారు. తెలుగువారిని స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉత్తరాఖండ్ ను కొన్ని రోజులుగా భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దాంతో, బద్రీనాథ్ యాత్రకు వెళ్లిన తెలుగువారు అక్కడ చిక్కుకుపోయారు.

  • Loading...

More Telugu News