: సీబీఐకి దొరికిపోయిన సెన్సార్ బోర్డు అధికారి... 'యూ సర్టిఫికెట్' ఇచ్చేందుకు లంచం డిమాండ్


సెన్సార్ బోర్డు అధికారి శ్రీనివాసరావును సీబీఐ అరెస్టు చేసింది. హైదరాబాదులో ఆయన ఓ నిర్మాత నుంచి లంచం స్వీకరిస్తుండగా సీబీఐ వలపన్ని దొరకబుచ్చుకుంది. 'అందాల చందమామ' చిత్రానికి యూ సర్టిఫికెట్ కోసం శ్రీనివాసరావు చిత్ర నిర్మాత నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. 'అందాల చందమామ' చిత్రాన్ని 'నిర్భయ' ఉదంతం ఆధారంగా నిర్మించినట్టు తెలిసింది. అయితే, ఆ సినిమాలో రేప్ నేపథ్యంలో కొన్ని అశ్లీల దృశ్యాలున్నాయని, అందుకే నిర్మాత యూ సర్టిఫికెట్ కోసం ప్రయత్నించినట్టు సమాచారం. కాగా, నిర్మాత మాత్రం తమ చిత్రంలో అలాంటి సీన్లు ఏవీ లేవని స్పష్టం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News