: ట్యునీషియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
ఉగ్రవాదులు ట్యునీషియాలో మరోసారి రెచ్చిపోయారు. సౌసీ పట్టణంలోని బీచ్ వద్ద ఉన్న హోటల్ రియూ ఇంపీరియల్ మర్హబాపై టెర్రరిస్టులు విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో 27 మంది ప్రాణాలు విడిచారు. మరణించిన వారిలో విదేశీయులు కూడా ఉన్నారు. ట్యునీషియా బలగాల ఎదురుదాడిలో ఓ సాయుధ ఉగ్రవాది మరణించాడు. మరొకరి కోసం వేట కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన వివరాలను ట్యునీషియా దేశీయ వ్యవహారాల మంత్రి తెలిపారు. కాగా, మార్చి నెలలోనూ ట్యునీషియాలో ఉగ్రవాదులు దాడిచేసి 22 మందిని పొట్టనబెట్టుకున్నారు.