: ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్న కొత్తజంట


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనవంతులకు పట్టం కట్టే ఫోర్బ్స్ జాబితాలో కొత్తజంట స్థానం సంపాదించుకుంది. హాలీవుడ్ సెలబ్రిటీ జంట అత్యధిక సంపాదనతో ఫోర్బ్స్ జాబితాలో నిలిచింది. వివిధ విభాగాలుగా సంపన్నుల జాబితా విడుదల చేసే ఫోర్బ్స్, ప్రపంచ వ్యాప్తంగా సంపాదనలో ఆకర్షణీయమైన జంటను ప్రకటించింది. అమెరికన్ నటి, పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్, ఆమె ప్రియుడు, నటుడు కాల్విన్ హారిస్ లను ఫోర్బ్స్ కొత్తజంటగా పేర్కొంది. వీరు ఏడాదికి 146 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నట్టు ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ ఆదాయం సంపాదించే టాప్ 20 మంది సెలబ్రిటీల్లో వీరిద్దరూ చోటుదక్కించుకున్నారని, జంటగా టాప్ పొజిషన్ లో నిలిచారని ఫోర్బ్స్ పేర్కొంది.

  • Loading...

More Telugu News