: కరీనాకు పెయింటింగ్ గిఫ్టుగా ఇచ్చిన సల్మాన్
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించని వర్ధమాన నటులు, నటీమణులు లేరంటే అతిశయోక్తి కాదు. సల్లూభాయ్ ఓ అవకాశం ఇప్పిస్తాడనో, లేక మంచి గిఫ్టు ఇస్తాడనో అతని స్వభావం తెలుసుకున్నవారు అతనితో సన్నిహితంగా ఉంటారని, మరికొందరు అతనిని పొగడ్తలతో ప్రసన్నం చేసుకుంటారని బాలీవుడ్ భోగట్టా. తాజాగా సల్మాన్ ఖాన్ ఓ పెయింటింగ్ వేశాడు. సల్మాన్ ను అమితంగా ఇష్టపడే అభిమానులు ఆ పెయింటింగ్ అద్భుతమని ఆకాశానికెత్తేశారు. 'భజరంగీ భాయ్ జాన్'లో సల్మాన్ సరసన నటించిన కరీనా కపూర్ కూడా ఆ పెయింటింగ్ బాగుందని మెచ్చుకుంది. దీంతో సల్లూభాయ్ విశాల హృదయుడై ఆ పెయింటింగ్ ను కరీనాకు గిఫ్టుగా ఇచ్చేశాడు.