: తెలంగాణ ఏసీబీకి అందిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్... సర్వత్ర ఉత్కంఠ
ఎట్టకేలకు తెలంగాణ ఏసీబీకి ఆడియో, వీడియోలకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ అందింది. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి అనుమతి పత్రం తీసుకున్న తర్వాత, దాన్ని ఏసీబీ కోర్టుకు సమర్పించారు ఏసీబీ అధికారులు. తదనంతరం మూడు హార్డ్ డిస్క్ లు, ఒక సీడీ, నివేదికను అధికారులకు కోర్టు అందజేసింది. ఫోరెన్సిక్ నివేదిక ఏసీబీకి అందడంతో, తర్వాత జరిగే పరిణామాలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. నివేదికలో ఏముందో? ఏసీబీ ఏ విధంగా ముందుకు వెళుతుందో? అన్న సందేహాలు ఇరు రాష్ట్రాల్లో నెలకొన్నాయి.