: రేవంత్ బెయిల్ పిటిషన్ పై తీర్పు మంగళవారానికి వాయిదా


ఓటుకు నోటు కేసులో రిమాండ్ లో ఉన్న టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తీర్పును హైకోర్టు మంగళవారానికి(ఈ నెల 30వ తేది) వాయిదా వేసింది. వాదనల సందర్భంగా, రేవంత్ ను విచారించడానికి ఇంకేమీ లేదని, షరతులతో కూడిన బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. రేవంత్ బెయిల్ పై విడుదలైతే, సాక్షులను, సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారని... దీంతో విచారణ ముందుకు సాగదని అడ్వొకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో, ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు... తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News