: తగిన సాక్ష్యాధారాలు చూపితే పంకజ ముండేపై విచారణ జరిపిస్తాం: ఫడ్నవిస్


పల్లీ పట్టీల స్కాంలో మహారాష్ట్ర మంత్రి పంకజ ముండేపై విచారణ జరిపించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ స్పందించారు. తమ ప్రభుత్వం అవినీతికి పూర్తిగా వ్యతిరేకమని... పంకజ ముండేపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలను చూపిస్తే, ఆమెపై విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. టెండర్లను పిలవకుండానే రూ. 206 కోట్లతో తినుబండారాలు, వాటర్ ఫిల్టర్లు, పుస్తకాలను కొనుగోలు చేశారంటూ పంకజ ముండేపై కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

  • Loading...

More Telugu News