: ఫిరాయింపుదార్లపై చర్యలు తీసుకోండి.. స్పీకర్ కు టీ టీడీపీ ఫిర్యాదు


తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని కొద్దిసేపటి క్రితం టీ టీడీపీ నేతలు కలిశారు. పార్టీ ఫిరాయింపుదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు స్పీకర్ ను కోరారు. తమ పార్టీ టికెట్ పై ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్నారని, వారి శాసనసభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని వారు స్పీకర్ ను డిమాండ్ చేశారు. తమ పార్టీ టికెట్ తో విజయం సాధించి, దానికి రాజీనామా చేయకుండానే తలసాని శ్రీనివాసయాదవ్ తో మంత్రిగా ప్రమాణ స్వీకారం ఎలా చేయిస్తారని స్పీకర్ ను టీ టీడీపీ నేతలు ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News