: ఎఫ్ఎస్ఎల్ అనుమతి లేనిదే సీల్డ్ కవర్ లోని అంశాలను బయటకు ఇవ్వలేం... ఏసీబీకి స్పష్టం చేసిన కోర్టు


ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) సీల్డ్ కవర్ లో సమర్పించిన నివేదిక కాపీని ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు తిరస్కరించింది. సీల్డ్ కవర్ లోని అంశాలను బయటకు ఇవ్వలేమని, కావాలంటే వాటిని కోర్టులోనే చూడవచ్చని ఏసీబీ అధికారులకు కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి అనుమతి తెచ్చుకుంటే కనుక నివేదిక కాపీ ఇస్తామని కోర్టు ఏసీబీకి తెలిపింది. ఈ క్రమంలో ఎఫ్ఎస్ఎల్ నుంచి అధికారులు అనుమతి లేఖ తెచ్చుకోనున్నారు. అంతకుముందు ఎఫ్ఎస్ఎల్ నివేదికను ఏసీబీ కోర్టు పరిశీలించింది. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపులను పరిశీలించిన ఎఫ్ఎస్ఎల్ రెండు రోజుల కిందట ఏసీబీ కోర్టుకు నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News