: అమెరికాలో కూలిన విమానం... తొమ్మిది మంది మృత్యువాత
అగ్రరాజ్యం అమెరికాలో తేలికపాటి విమాన ప్రమాదాలు నిత్యకృత్యంలా మారాయి. నేటి ఉదయం ఆ దేశంలోని అలస్కా ప్రాంతంలో ఓ తేలికపాటి విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సింగిల్ ఇంజిన్ కలిగిన సదరు విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటిలోనే కుప్పకూలినట్లు అధికారులు చెప్పారు. ప్రతికూల వాతావరణం కారణంగానే విమానం కూలిపోయిందని తెలుస్తోంది. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా ఘటనా స్థలికి చేరుకోలేకపోతున్నామని, ప్రతికూల వాతావరణం అడుగడుగునా ఇబ్బందులు కలిగిస్తోందని అధికారులు చెబుతున్నారు.