: పుష్కరాలు రాకుండానే భక్తులకు చుక్కలు కనిపిస్తున్నాయ్!


గోదావరి పుష్కరాలు ప్రారంభం కాకుండానే భక్తులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పుష్కరాలను అంగరంగ వైభవంగా జరిపిస్తామంటూ, కోట్ల రూపాయల నిధులను ఖర్చుచేసి చేపట్టిన పనులు, అరకొరగానే మిగిలిపోయాయి. మరో మూడు వారాల్లో పుష్కరాలు ప్రారంభం కానుండగా, గోదావరి తీరం ఇటీవలి వరదల కారణంగా బురదతో నిండిపోయింది. వరదకు కొట్టుకొచ్చిన ఎర్రమట్టి బురదతో స్నానఘట్టాలు, నదీ తీరం నిండిపోవడంతో భక్తులు స్నానం చేసే పరిస్థితి లేక వెనుదిరుగుతున్నారు. కనీసం నదిలోని నీటిని తలపై చల్లుకునే పరిస్థితి లేకపోవడంతో అధికారులపై భక్తులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. గోదావరి వరద తగ్గి 3 రోజులైనా స్నానఘట్టాల్లో బురద తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టడంలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. భద్రాచలం నుంచి రాజమండ్రి వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక పుష్కరాలకు వారం రోజుల ముందు ఇదే తరహాలో వరదలు వస్తే పరిస్థితి ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News