: కేదార్ నాధ్ కు మళ్లీ వరద, ఉన్న ఒక్క వంతెనా కూలిపోవడంతో ఆందోళన
ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు కేదార్ నాధ్ ప్రాంతాన్ని వరదలు చుట్టుముట్టాయి. వరదల ధాటికి కేదార్ నాధ్ కు భక్తులను చేరవేసేందుకు మందాకినీ నదిపై నిర్మించిన ప్రధాన వంతెన కొట్టుకుపోయింది. దీంతో నదిని దాటే మార్గం లేక భక్తులు ఆందోళన చెందుతున్నారు. కేదార్ నాథ్కు వెళ్లే మార్గంలోని సోన్ ప్రయాగ్, గౌరీ కుండ్ ల మధ్య ఈ బ్రిడ్జి ఉంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా, పర్వత ప్రాంతాల్లో నీటి ప్రవాహం ఎక్కువైందని, మందాకినీ నదిని వరద ముంచెత్తిందని అధికారులు తెలిపారు. కాగా, బ్రిడ్జి వరదల్లో కొట్టుకుపోయిన సమయంలో దానిపై ఏ వాహనమూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పినట్లయింది.