: లలిత్ మోదీ చేస్తున్న ఆరోపణలు నిరాధారం: రాష్ట్రపతి కార్యాలయం


ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వ్యవహారంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కార్యాలయం స్పందించింది. రాష్ట్రపతి కార్యాలయ సెక్రటరీ ఒమితా పాల్ పై చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేసింది. "ఆ మాటలన్నీ నిరాధారం. కావాలని చేసిన ఆ వ్యాఖ్యలు ప్రమాదకరమైనవి" అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పలువురు రాజకీయ నేతలు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, కాంగ్రెస్ నేతలు శశి థరూర్, రాజీవ్ శుక్లా తదితరులపై ఓ వారం కిందట లలిత్ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News