: విలేకరుల వీరంగం... పోలీసు వాహనాన్ని అడ్డుకుని అడ్డంగా బుక్కైన వైనం


ఇద్దరు విలేకరులు వీరంగం సృష్టించారు. నడి రాత్రి వేళ తమకు కనిపించిన వాహనాన్ని గంజాయి తరలించే వాహనంగా పొరబడ్డారు. ముందూ వెనుకా చూసుకోకుండా వాహనాన్ని నిలిపేశారు. తీరా ఆ వాహనం నుంచి పోలీసులు దిగడంతో కంగుతిన్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లారు. విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలంలో గత అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. చేతివాటానికి అలవాటుపడ్డ ఇద్దరు విలేకరులు గంజాయి ముఠాను అడ్డుకుని వసూళ్లు రాబట్టాలని పథకం పన్నారు. అర్ధరాత్రి అటుగా వచ్చిన ఓ వాహనాన్ని వారు గంజాయి ముఠాకు చెందినదిగానే భావించి దానిని అడ్డుకున్నారు. తీరా ఆ జీపు స్పెషల్ బ్రాంచి పోలీసులది కావడంతో విలేకరులు అయోమయంలో పడ్దారు. విలేకరులు తేరుకునేలోగానే స్పందించిన స్పెషన్ బ్రాంచి పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News