: రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చేనా?... నేడు విచారణకు బెయిల్ పిటీషన్


ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కేసులో కీలక ఆధారాలు లభించాయని చెప్పిన ప్రభుత్వం, వాటిని కోర్టుకు అందించేందుకు సమయం కావాలని కోరిన నేపథ్యంలో మూడు రోజుల క్రితం విచారణకు వచ్చిన ఈ బెయిల్ పిటీషన్ ను కోర్టు నేటికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ వివాదంపై పక్కా ఆధారాలున్నాయన్న ఏపీ సర్కారు వాదనతో తెలంగాణ ప్రభుత్వం ఓటుకు నోటు కేసులో కాస్తంత దూకుడును తగ్గించిన నేపథ్యంలో రేవంత్ కు బెయిల్ గ్యారెంటీ అన్న వాదన మొన్న వినిపించింది. అయితే మూడు రోజుల్లోనే పరిస్థితి మొత్తం మారిపోయింది. దీంతో నేడు జరగనున్న విచారణపై ఇరు రాష్ట్రాల ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News