: చెల్లికి ఈ ప్రయత్నమైనా కలిసొస్తుందో లేదో చూడాలి: శిల్పాశెట్టి


బుల్లి తెర అయినా తన చెల్లి షమితా శెట్టికి కలిసి వస్తుందో లేదో చూడాలని బాలీవుడ్ నటి శిల్పాశెట్టి పేర్కొంది. 'మొహబ్బతే' సినిమా ద్వారా బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన షమితా శెట్టి అక్కలా స్టార్ డమ్ సంపాదించుకోలేకపోయింది. దీంతో 'జెహర్' వంటి సినిమాలు అడపాదడపా ఒకట్రెండు ఆడినా హీరోయిన్ అని చెప్పుకోడానికే తప్పితే, ఆమె ఖాతాలో ఘనవిజయాలు పడలేదు. దీంతో 'క్యాష్' సినిమా తర్వాత, కొంత కాలం ఇంటీరియర్ డిజైనింగ్ పై దృష్టి సారించింది. తాజాగా 'జలక్ దిఖలాజా' డ్యాన్స్ షోతో బుల్లితెరంగేట్రం చేయనుంది. దీంతో ఈ ప్రయత్నం అయినా చెల్లికి కలిసివస్తుందో లేదో అని శిల్పా శెట్టి పేర్కొంది. 'బిగ్ బ్రదర్' షోతో శిల్పా శెట్టి అంతర్జాతీయ గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News