: ఏపీకి షాకిచ్చిన తెలంగాణ


హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాలని పట్టుబడుతున్న ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. భౌగోళికంగా తెలంగాణలో ఉన్న సంస్థలన్నీ తెలంగాణకే చెందుతాయని, ఒకవేళ సేవలు కావాలని ఏపీ కోరితే, ఛార్జీలు చెల్లించి సేవలు పొందాలంటూ వివిధ శాఖలకు తెలంగాణ ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో చట్టంలో పదో షెడ్యూల్ లో ఉన్న సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం హైదరాబాదు, దాని చుట్టుపక్కల గల 142 ప్రభుత్వ సంస్ధల ఆస్తులు, నిధులు అన్నీ తెలంగాణకే చెందుతాయని, ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఇతర ప్రాంతాల వారిని పంపించివేసి, తెలంగాణ వారినే ఉన్నత స్థానాల్లో నియమించుకోవాలని పేర్కొంది. ప్రభుత్వంలోని అన్ని శాఖల కార్యదర్శులతో సీఎస్ రాజీవ్ శర్మ సమావేశమైన అనంతరం ఈ ఉత్తర్వులు వెలువడ్డాయని సమాచారం.

  • Loading...

More Telugu News