: సినిమా ఇండస్ట్రీ అంతా తెలంగాణ సర్కారును ప్రశంసిస్తోంది!: ఎంపీ సుమన్
టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ నేతలను దుయ్యబట్టారు. సినిమా ఇండస్ట్రీ అంతా తెలంగాణ సర్కారును పొగుడుతోందని, సీఎం కేసీఆర్ పథకాలపై సినీ రంగం ప్రశంసల వర్షం కురిపిస్తోందని అన్నారు. హైదరాబాదులో పరిశ్రమలు పెట్టేందుకు ఎక్కడెక్కడి నుంచో పారిశ్రామికవేత్తలు తరలివస్తున్నారని చెప్పారు. అలాంటిది, ఇక్కడ పరిస్థితులు బాగా లేవని, సెక్షన్-8 అమలు చేయాలని ఏపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆంధ్రా నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం లేనట్టుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు.