: దేశ రాజధాని ప్రాంతంలో మరో విమానాశ్రయం
దేశ రాజధాని ప్రాంతంలో మరో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పటికే ఢిల్లీలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సేవలందిస్తుండడం తెలిసిందే. కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణం ప్రతిపాదనకు పౌర విమానయాన శాఖ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు బాధ్యతలు నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూపుకే ప్రతిపాదిత విమానాశ్రయం అభివృద్ధి బాధ్యతలు అప్పగించనున్నట్టు పౌర విమానయాన శాఖ తెలిపింది. ఇవాళే దీనికి సంబంధించిన ఫైల్ పై ఆమోద ముద్ర వేసిన విమానయాన మంత్రిత్వ శాఖ, త్వరలోనే ఆ ఫైల్ ను క్యాబినెట్ ఆమోదానికి పంపనుంది. కాగా, ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా 2014-15 మధ్య కాలంలో 4 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారట. రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగానే మరో ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్రం సంకల్పించినట్టు అర్థమవుతోంది.