: ముగిసిన జయ ఎన్నికల ప్రచారం
అన్నా డీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగిసింది. ఈ ఎన్నికల ప్రచారంలో జయతో పాటు ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి జయలలిత పోటీ చేస్తున్న సంగతి విదితమే. ఎల్లుండి ఉదయం పోలింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం 28 మంది అభ్యర్థులు ఆర్కే నగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు, లెఫ్ట్ పార్టీలు కూడా జయతో పోటీగా ప్రచారాన్ని భారీ ఎత్తున నిర్వహించాయి.