: కడియం శ్రీహరి అసలు దళితుడే కాదు: సర్వే సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అసలు దళితుడే కాదని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, కడియం శ్రీహరి ఎస్సీ వర్గానికి చెంది వ్యక్తి కాదని, ఆయన అసలు దళితుడే కాదని అన్నారు. కడియం కులంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, గతంలో కడియం ఉపముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పుడు, ఆయన కులంపై టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయగా, ఆయన వాటిని ఖండిస్తూ, తాను దళితుడనేని, ఎస్సీ కేటగిరీలోని ఓ ఉపకులానికి సంబంధించిన వాడినని పేర్కొన్నారు. ఇన్నాళ్టికి సర్వే కూడా అలాంటి వ్యాఖ్యలే చేయడం విశేషం.