: 'ఆడియో, వీడియో టేపు'ల నివేదిక కాపీ కోసం ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన చీఫ్ ఎలక్షన్ కమిషన్
అవినీతి నిరోధక శాఖ కోర్టులో చీఫ్ ఎలక్షన్ కమిషన్ మెమో దాఖలు చేసింది. ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్) సమర్పించిన ఆడియో, వీడియో టేపుల నివేదిక కాపీని తమకు అందించాలని మెమోలో సీఈసీ పేర్కొంది. ఇదిలా ఉంచితే, ఈ కేసులో దర్యాప్తును వేగంగా పూర్తి చేయాలంటూ కొన్ని రోజుల కిందట ఎన్నికల కమిషన్ చెప్పిందని తెలంగాణ ఏసీబీ ప్రకటించిన విషయం తెలిసిందే.