: బాబుపై కేసు నమోదు చేయండి: రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కేసు నమోదు చేయాలంటూ హైదరాబాదు, ఎల్బీనగర్ పోలీసులకు రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ఓటుకు నోటు కేసు విషయంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్రంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది భార్గవ్ రంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన న్యాయస్థానం చంద్రబాబునాయుడుపై కేసు నమోదు చేయాలంటూ ఎల్బీనగర్ పోలీసులను ఆదేశించింది.