: మోదీకి ధన్యవాదాలు తెలిపిన నేపాల్


భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయిన నేపాల్ కు భారత్ అన్ని విధాలా సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ హిమాలయ దేశానికి బిలియన్ డాలర్ల మేర భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది భారత్. కాగా, భారత్ తమను ఆదుకోవడం పట్ల నేపాల్ సర్కారు సంతోషం వ్యక్తం చేసింది. భూకంపం మిగిల్చిన విషాదం నుంచి కోలుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని కొనియాడింది. ఈ మేరకు తన సందేశాన్ని ప్రధాని మోదీకి అందించాల్సిందిగా నేపాల్ ప్రధాని రామ్ బరణ్ యాదవ్ తనను కలిసిన భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ను కోరారు. సుష్మ ఖాట్మండూలో నిర్వహించిన అంతర్జాతీయ దాతల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సుష్మ, భారత్ కు నేపాల్ కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం లేదని, ఓ పొరుగుదేశంగానే నేపాల్ కు ఆపన్న హస్తం అందించామని నేపాల్ ప్రధానికి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News