: తొలి శుభలేఖను మాజీ ప్రేయసికిచ్చిన బాలీవుడ్ హీరో


'లవ్ ఆజ్ కల్' సినిమాలో అద్భుతమైన ప్రేమ జంటగా అభిమానులను అలరించిన షాహిద్ కపూర్, కరీనా కపూర్ నిజజీవితంలో కూడా ప్రేమికులుగా మారారు. తరువాత వ్యక్తిగత కారణాల రీత్యా విడిపోయారు. విడిపోయిన తరువాత వీరిద్దరూ కలిసి నటించేందుకు కూడా ఇష్టపడలేదు. అయినా చాలా సందర్భాల్లో షాహిద్ కపూర్ మాజీ ప్రేయసిపై అభిమానం చూపించేవాడు. కాల క్రమంలో కరీనా కపూర్ సహనటుడు సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకుని సెఫీనాగా మారింది. కరీనాతో విడిపోయిన షాహిద్ మరెవరితోనూ అంతలోతు ప్రేమలో పడలేదు. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోనున్నాడు. ఈ క్రమంలో షాహిద్ వివాహానికి మాజీ ప్రేయసిని పిలుస్తాడా? లేదా? అంటూ బాలీవుడ్ లో పెద్దచర్చే నడిచింది. అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ షాహిద్ కపూర్ తన మొదటి శుభలేఖను కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ దంపతులకు అందజేశాడు. కరీనా కంటే మంచి భార్య దొరికిందని చెప్పడానికి ఇలా చేశాడా? లేక తాను కూడా పెళ్లి చేసుకుంటున్నానని చెప్పడానికి ఇలా చేశాడా? అంటూ బాలీవుడ్ లో ఊహాగానాలు మొదలయ్యాయి.

  • Loading...

More Telugu News