: టీచరు ఉద్యోగం రాలేదని ఎమ్మెస్సీ బీఈడీ చదివిన యువతి ఆత్మహత్య


మోడల్ స్కూల్లో టీచరు ఉద్యోగం సంపాదించలేకపోయానన్న ఆత్మన్యూనతలో తనువు చాలించిందో విద్యాధికురాలు. ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అంబవరంలో నేడు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన మాధవి (23) ఎమ్మెస్సీ బీఈడీ వరకు చదివి, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కృషి చేస్తూ ఉండేది. గతంలో రాసిన డీఎస్సీలో రెండు మార్కుల తేడాతో ఉద్యోగం చేజార్చుకుంది. నిన్న రాచర్లలో మోడల్ స్కూల్ టీచర్ల ఎంపిక నిమిత్తం జరిగిన ఇంటర్వ్యూకు హాజరైంది. అక్కడ కూడా విజయం సాధించలేకపోవడంతో మనస్తాపానికి గురైంది. ఈ ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమెను గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News