: రేవంత్ కు బెయిల్ రావాలని ప్రార్థిస్తూ పూజలు
ఓటుకు నోటు కేసులో అరెస్టైన టీటీడీపీ నేత రేవంత్ రెడ్డికి బెయిల్ రావాలంటూ పూజలు కూడా జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే, తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు మధుసూదనరెడ్డి హైదరాబాద్ వనస్థలిపురంలోని ప్రశాంతినగర్ లో ఉన్న సాయిబాబా ఆలయంలో ఈ మేరకు పూజలు చేయించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమానికి పలువురు టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. గతంలో వైకాపా అధినేత జగన్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితలు జైల్లో ఉన్నప్పుడు కూడా వారి అభిమానులు ఇలాగే పూజలు నిర్వహించారు. తమ నేత బయటపడాలని దేవుళ్లను కోరుకున్నారు.