: క్రికెట్ కోచ్ కన్నా ఐఐటీ శిక్షకులకే అధిక వేతనం!


ఇండియాలో అత్యధికంగా వేతనాలు తీసుకుంటున్నది ఎవరు? ఈ ప్రశ్నకు ముందుగా వచ్చే సమాధానం ఐటీ కంపెనీలలో పనిచేసే సీఈఓలు అని. లేకుంటే స్వీయ కంపెనీల్లో పనిచేస్తున్న చైర్మన్ల పేరు వినిపిస్తుంది. అదీ కాకుంటే, భారత క్రికెట్ జట్టు కోచ్ డంకన్ ఫ్లెచర్ పేరు వస్తుంది. కానీ, వాస్తవానికి ఇవేమీ సరైన సమాధానం కాదు. ఇండియాలో అత్యధిక వేతనం తీసుకుంటున్నది ఎవరో తెలుసా? ఐఐటీ సాధించాలని కలలుగనే విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవారట. నైపుణ్యముండి పాఠ్యాంశాలను విద్యార్థులకు చక్కగా వివరించగల ఐఐటీ పోటీ పరీక్షల శిక్షకులకు కోటి నుంచి రెండు కోట్ల రూపాయల వరకూ వేతనాలు అందుతున్నాయి. అది కూడా మూడు, నాలుగు నెలల సీజనుకు మాత్రమే. రాజస్థాన్ లోని కోటా ప్రాంతంలో ఐఐటీ సీటు కోరే విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న వారిలో 15 నుంచి 20 మందికి కోటి రూపాయలకు పైగా వేతనాలు అందుతున్నాయని బన్సాల్ క్లాసెస్ మేనేజర్ హరి కిషన్ వివరించారు. ఇక ముంబై, ఢిల్లీ, కాన్పూర్, పాట్నా... ఇలా దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ఈ సంఖ్య వందల్లోనే ఉంటుంది. శిక్షకులకు డిమాండ్ అత్యధికంగా ఉంటోందని, ఎక్కడ ఎక్కువ వేతనం ఆఫర్ వస్తే అక్కడికి వెళ్లిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని హరి కిషన్ తెలిపారు. దేశంలో ఐఐటీ శిక్షకులుగా 2 వేల మంది ఉంటే, అందులో 600 మంది వరకూ ఐఐటీ డిగ్రీలను పూర్తి చేసిన వారే. వీరిలో 400 మందికి రూ. 60 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకూ వేతనాలు అందుతున్నాయి. మరో 50 మందికి అంతకుమించిన జీతాలు వస్తున్నాయి. గడచిన పదేళ్లలో ఐఐటీ శిక్షకులకు ఇస్తున్న వేతనాలు 7 రెట్ల వరకూ పెరిగాయని లిస్టెడ్ సంస్థ కెరీర్ పాయింట్ వ్యవస్థాపక సీఈఓ ప్రమోద్ మహేశ్వరి తెలిపారు. కాగా, ఈ సంవత్సరం ఐఐటీ జాయింట్ ఎంట్రెన్స్ పరీక్షలకు 1.3 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీరు కోచింగ్ నిమిత్తం ఇనిస్టిట్యూట్ లకు వెళితే, ఫీజు రూపంలో కనీసం లక్ష రూపాయలు చెల్లించాల్సి వుంటుంది. పేరున్న ఇనిస్టిట్యూట్లలో ఈ ట్యూషన్ ఫీజు రూ. 3 లక్షల వరకూ కూడా ఉందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News