: విభేదాల మంటను ఎగదోసిన విరాట్ కోహ్లీ!


భారత క్రికెట్ జట్టులో నెలకొన్న నాయకత్వ విభేదాల మంటను విరాట్ కోహ్లీ మరింతగా ఎగదోశాడు. డ్రస్సింగ్ రూంలో నెలకొన్న సమస్యల కారణంగా, మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకనే బంగ్లాదేశ్ పై ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చిందని ఆయన అన్నాడు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ధోనీ పేరు ప్రస్తావించకుండా కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ, వారిద్దరి మధ్యనున్న పొరపొచ్చాలు మరోసారి నలుగురికీ తెలిశాయి. "మైదానంలో మేము తీసుకున్న నిర్ణయాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఈ విషయాన్ని నేను చెప్పనక్కర్లేదు. క్రికెట్ ను పరిశీలిస్తున్న నిపుణుల నుంచి సాధారణ అభిమానుల వరకూ అందరికీ తెలిసిపోయాయి. స్పష్టమైన వ్యూహాలతో తొలి రెండు గేములనూ ఆడలేకపోయాము" అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. డ్రస్సింగ్ రూంలో వాతావరణం ఎప్పటిలానే వుందని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించిన మరుసటి రోజు అందుకు వ్యతిరేకంగా కోహ్లీ మాట్లాడటం గమనార్హం.

  • Loading...

More Telugu News