: నరసింహన్... ఢిల్లీకి రండి: కేంద్రం ఆదేశాలతో నేటి సాయంత్రం హస్తినకు గవర్నర్


ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఉన్నపళంగా ఢిల్లీ రావాలన్న కేంద్ర హోంశాఖ ఆదేశాలతో నేటి సాయంత్రం 4 గంటలకు ఆయన డిల్లీ విమానం ఎక్కనున్నారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వివాదాల నేపథ్యంలో హైదరాబాదులో సెక్షన్ 8 అమలుపై తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ కు ఢిల్లీ నుంచి పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాక హైదరాబాదులో సెక్షన్ 8 అమలుపై ఇప్పటికే ఆయన కేంద్రానికి లేఖ రాశారన్న ప్రచారమూ సాగింది. గవర్నర్ ను ఏ పని నిమిత్తం కేంద్రం పిలిచిందన్న దానిపై ఇరు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News