: ‘ఫోరెన్సిక్’ నివేదిక ఇవ్వండి... కోర్టులో మెమో దాఖలు చేసిన ఏసీబీ


ఓటుకు నోటు కేసులో కీలక సాక్ష్యాల దిశగా సాగుతున్న ఏసీబీ అధికారులు కొద్దిసేపటి క్రితం కోర్టులో మెమో దాఖలు చేశారు. కేసులో కీలకంగా మారిన ఆడియో, వీడియో టేపుల వాస్తవికతను నిర్ధారిస్తూ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నిన్న కోర్టుకు తన నివేదికను అందజేసింది. సదరు నివేదిక కాపీలను తమకు అందించాలని నేటి మెమోలో ఏసీబీ అధికారులు కోర్టును అభ్యర్థించారు. దర్యాప్తులో ఈ నివేదిక తమకు కీలకం కానుందని ఏసీబీ అధికారులు కోర్టుకు తెలిపారు. దీనిపై మరికాసేపట్లో కోర్టు తన నిర్ణయం వెలువరించనుంది.

  • Loading...

More Telugu News