: కంపెనీలో చేరనందుకు రూ. 13 కోట్లు ఇస్తున్న ఎంఎన్ సీ


ఆదిదాస్, కాల్విన్ క్లెన్, ప్లేబాయ్ తదితర ప్రసిద్ధ బ్రాండ్లను అందిస్తున్న బ్యూటీ సంస్థ 'కోటీ ఐఎన్సీ' తమ సంస్థలో చేరకుండా ఉండేందుకు ఎలియో లియోనీ స్కేటీ అనే వ్యక్తికి 1.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 13 కోట్లు) ఇవ్వనుంది. అసలు విషయం ఏంటంటే, స్కేటీ ప్రస్తుతం ఆహార ఉత్పత్తుల సంస్థ ఇగ్లూ గ్రూప్ సీఈఓగా పనిచేస్తున్నాడు. అక్కడ రాజీనామా చేసి 'కోటీ'లో చేరేందుకు నిశ్చయించుకున్నాడు. వేతన ప్యాకేజీ నుంచి ఇతరత్రా ప్రోత్సాహకాల వరకూ అన్నీ ఓకే అయిపోయాయి. అయితే, ప్రస్తుతం తాత్కాలిక సీఈఓగా ఉన్న బార్ట్ బెచత్ నే కొనసాగించాలని కోటీ ఐఎన్ సీ భావించింది. దీంతో స్కేటీకి భారీ మొత్తంలో పరిహారంతో పాటు ముందుగా ఇస్తామని చెప్పిన 50 వేల డాలర్ల విలువైన కోటీ ఐఎన్ సీ వాటాలను కూడా ఇచ్చేందుకు ముందుకు వచ్చి సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంది. ఈ విషయాన్ని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కి 'కోటీ' వెల్లడించింది. వాస్తవానికి స్కేటీ వచ్చే నెలలో సంస్థ సీఈఓగా బాధ్యతలు స్వీకరించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంతలోనే ఈ మార్పు జరిగింది.

  • Loading...

More Telugu News