: విజేతకు బానిస మహిళను బహుమతిగా ఇస్తారట!
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు దురాగతాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. నిర్దాక్షిణ్యంగా గొంతు కోసి చంపడం, సజీవదహనం చేయడం, నీటిలో ముంచి ఊపిరాడకుండా చేయడం వంటి దారుణ చర్యలతో హత్యాకాండ కొనసాగిస్తున్న ఈ ముష్కర మూక తాజాగా ఎలాంటి ప్రకటన విడుదల చేసిందో చూడండి! ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ పఠనం పోటీలో ప్రథమ స్థానంలో వచ్చిన వ్యక్తికి బానిస మహిళను బహుమతిగా అందిస్తామని ప్రకటించింది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈ పోటీ నిర్వహిస్తున్నారట. ఇక, తర్వాతి స్థానాల్లో నిలిచిన వ్యక్తులకు నగదు బహుమతులు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అరబిక్ భాషలో ఉన్న ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.