: అత్యవసరంగా ముంబైలో దిగిన ఆస్ట్రేలియా విమానం


ఆస్ట్రేలియాకు చెందిన విమానం ఒకటి ముంబైలో అత్యవసరంగా దిగింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ బస్ 380 ముంబైలోని శివాజీ టెర్మినల్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. దుబాయ్ వెళ్తున్న ఇద్దరు ప్రయాణికులు ఛాతీ నొప్పితో బాధపడుతుండడంతో, వారి ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకున్న విమాన సిబ్బంది, విమానాన్ని కిందికి దించి, వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News