: దిల్ రాజు, సుమంత్ అశ్విన్ లపై కోడిగుడ్లతో దాడి చేసిన విద్యార్థులు
శ్రీకాకుళంలో 'కేరింత' చిత్ర యూనిట్ కు చేదు అనుభవం ఎదురైంది. తమ భాషను కించపరిచారంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఓ సినిమా థియేటర్ వద్ద నిర్మాత దిల్ రాజును, ఇతర యూనిట్ సభ్యులను అడ్డుకున్నారు. వారి కార్లపై విద్యార్థులు కోడిగుడ్లతో దాడికి దిగారు. దీంతో దిల్ రాజు విద్యార్థులకు క్షమాపణలు తెలిపారు. అనంతరం, పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అడవి సాయికిరణ్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, శ్రీదివ్యలతో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.