: రాణించిన టాపార్డర్...టీమిండియా 317/6
టీమిండియా ఎట్టకేలకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేసింది. వన్డే సిరీస్ లో స్వల్ప స్కోర్లకే వెనుదిరిగి, సిరీస్ పరాజయం మూటగట్టుకున్న టీమిండియా ఆటగాళ్లు, ప్రాధాన్యత లేని మ్యాచ్ లో రాణించారు. అన్ని పక్కల నుంచి విమర్శల దాడి జరగడంతో టీమిండియా ఆటగాళ్లలో చలనం వచ్చింది. దీంతో టాప్ ఆర్డర్ కలిసికట్టుగా రాణించి ఈ వన్డే సిరీస్ లో తొలిసారి 300 మార్కును దాటించింది. దీంతో టీమిండియా అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ధావన్ (75), రోహిత్ (29) శుభారంభం ఇవ్వడానికి తోడు కోహ్లీ (25) రెండంకెల స్కోరు చేయడంతో టీమిండియా గత రెండు వన్డేల కంటే భిన్నమైన ఆటతీరు ప్రదర్శించేందుకు సిద్ధమైనట్టు బంగ్లా జట్టుకు సూచనలు పంపింది. ధావన్ కు జత కలిసిన ధోనీ (69) బంగ్లా బౌర్లను సమర్ధవంతంగా అడ్డుకున్నాడు. ధావన్ అవుటవ్వడంతో క్రీజులోకి వచ్చిన రాయుడు (44) అతనికి చక్కని సహకారమందించినప్పటికీ అంపైర్ వివాదాస్పద నిర్ణయం కారణంగా అవుటయ్యాడు. అనంతరం బిన్నీ (10) అండతో రైనా (38), అక్షర్ పటేల్ (10) వేగంగా ఆడడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి టీమిండియా ఈ వన్డే సిరీస్ లో తొలిసారి 317 పరుగులు సాధించింది. బంగ్లా బౌలర్లలో ముర్తజా (3), ముస్తాఫిజుర్ (2) రాణించారు