: ఒమర్ అబ్దుల్లా కుమారులకు తాజ్ మహల్ వద్ద చేదు అనుభవం


జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తనయులకు ఆగ్రాలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఇద్దరు కుమారులు జమీర్, జహీర్ సుప్రసిద్ధ తాజ్ మహల్ సందర్శనకు వెళ్లగా, అక్కడి భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. స్వదేశీ పర్యాటకుల టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లిన వారిని సీఐఎస్ఎఫ్ బలగాలతో పాటు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సిబ్బంది కూడా నిలువరించారు. వారి వేషధారణ చూసి విదేశీయులుగా పొరబడిన సదరు సిబ్బంది, ఫారెన్ టూరిస్టుల కోసం ఉద్దేశించిన కౌంటర్లో టికెట్లు తీసుకోవాలని వారికి సూచించారు. అంతేగాకుండా, ఆ ఇద్దరు సోదరుల వెంట ఉన్న భద్రత సిబ్బందిని కూడా తాజ్ మహల్ సిబ్బంది ఆపేశారు. ఆయుధాలతో లోనికి వెళ్లనివ్వబోమని స్పష్టం చేశారు. దాదాపు గంటసేపు ఈ గందరగోళం కొనసాగింది. చివరికి స్థానిక పోలీసులు రంగప్రవేశం చేయడంతో వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. వచ్చినవారెవరో తెలుసుకున్న పోలీసులు, వారు జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కుమారులని తాజ్ మహల్ వర్గాలకు తెలిపారు. దీంతో, అక్కడ నెలకొన్న గందరగోళం తొలగిపోయింది.

  • Loading...

More Telugu News