: ఫాంహౌస్ లో స్టీఫెన్ సన్ తో భేటీ అయిన కేసీఆర్... డీజీపీ కూడా!


'ఓటుకు నోటు' కేసులో ఫిర్యాదిదారు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఈ మధ్యాహ్నం కేసీఆర్ తో కలిసి రహస్య చర్చలు జరిపారు. మెదక్ జిల్లాలోని కేసీఆర్ ఫాం హౌస్ లో ఈ భేటీ జరిగింది. తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ సైతం ఈ భేటీలో పాల్గొనడం ఆసక్తిని పెంచింది. ఫాంహౌస్ కు స్టీఫెన్ సన్, శర్మలు వచ్చి కేసీఆర్ తో ప్రత్యేకంగా సమావేశం కావడంతో, పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫాంహౌస్ లోపలికి ఎవరినీ అనుమతించలేదు. రేవంత్ రెడ్డి కేసులో తాజా పరిణామాలను వీరు కేసీఆర్ కు వివరించినట్టు తెలుస్తోంది. ఈ బేటీపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News