: టాస్ గెలిచిన బంగ్లాదేశ్... పరువు కోసం భారత్ ఆరాటం
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో వన్డేలో టాస్ వేశారు. టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో, భారత్ బ్యాటింగ్ చేయనుంది. కాగా, ఇప్పటికే తొలి రెండు వన్డేలు నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు చివరి వన్డేలోనూ విజయభేరి మోగించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. టీమిండియా విషయానికొస్తే ఈ మ్యాచ్ లోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో, మిర్పూర్ షేర్-ఏ-బంగ్లా స్టేడియంలో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.