: సెక్షన్-8పై విశాఖ రౌండ్ టేబుల్ రసాభాస!
రేవంత్ రెడ్డి 'ఓటుకు నోటు' కేసు తరువాతనే సెక్షన్-8 గుర్తుకొచ్చిందా? రంగారెడ్డి జిల్లా కోర్టులో లాయర్లపై దాడులు జరిగినప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు? అని న్యాయవాదులు ప్రశ్నించడంతో విశాఖపట్నంలో ఏపీజేఎఫ్ (ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం) సెక్షన్-8 అమలుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం రసాభాసగా మారింది. ఆనాడు స్పందించని తెలుగుదేశం పార్టీ నేడు రాద్ధాంతం చేస్తోందని సమావేశానికి వచ్చిన లాయర్లు విమర్శించారు. వేదికపై ఉన్న పెద్దలు సమైక్య ఉద్యమం నుంచి తప్పుకుంటే తామే ముందు నిలిచామని లాయర్లు తెలిపారు. న్యాయవాదుల వాదనకు సమావేశానికి వచ్చిన పలువురు మద్దతు పలకడంతో సర్దిచెప్పేందుకు నిర్వాహకులు ఇబ్బందులు పడ్డారు.