: ప్రజా దర్బార్ లో ప్రజల సమస్యలు తెలుసుకుని, అర్జీలు స్వీకరిస్తున్న బాలయ్య


అనంతపురం జిల్లాలోని తన నియోజకవర్గం హిందూపురంలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ లో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. పట్టణంలోని సాయి ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న కార్యక్రమంలో బాలయ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. స్ధానికులు ఒక్కొక్కరుగా వచ్చి బాలయ్యకు తమ సమస్యలు వివరిస్తున్నారు. అనంతరం వారి అర్జీలు స్వీకరిస్తున్నారు. అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. హిందూపురం మున్సిపాల్టీ పరిధిలోని 38 వార్డులకు సంబంధించిన సమస్యలపై అర్జీలను స్వీకరిస్తున్నారు. రెండు రోజుల పాటు ఈ ప్రజాదర్బార్ కొనసాగుతుందని ఈ సందర్భంగా బాలయ్య తెలిపారు. రేపు హిందూపురం రూరల్, లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లోని సమస్యలపై అర్జీలను స్వీకరిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News