: జి-మెయిల్ యూజర్లకు అందుబాటులోకి వచ్చిన 'అన్ డూ సెండ్' ఆప్షన్
మీరు జీ-మెయిల్ వాడుతున్నారా? ఎవరికైనా పొరపాటున మెయిలు పంపి ఆపై వెంటనే ఎందుకు పంపామా అని భావించారా? అయితే మీ కోసమే వచ్చేసింది 'అన్ డూ సెండ్' ఆప్షన్. ఆరేళ్ల క్రితమే ఈ ఆప్షన్ ను ప్రవేశపెట్టాలని గూగుల్ భావించినప్పటికీ, పలు కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ ఆప్షన్ ను జీ-మెయిల్ తన 'ల్యాబ్' నుంచి తెచ్చి 'ట్యాబ్'గా మార్చింది. ఈ సదుపాయం పొందాలంటే, జనరల్ ట్యాబ్ సెట్టింగ్స్ లోకి వెళ్లి 'అన్ డూ సెండ్' ఆప్షన్ ను ఎనేబుల్ చేసుకోవాలి. దీనికి కొంత సమయాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు నిర్ణయించుకున్న వెయిటింగ్ సమయం ముగిసే వరకూ ఆ మెయిల్ టార్గెట్ యూజరుకు చేరదు. ఈ లోగా మెయిల్ పంపకూడదని భావిస్తే, దాన్ని 'అన్ డూ సెండ్' ఆప్షన్ ద్వారా ఆపుకోవచ్చు. ఇటీవల జరిగిన ఐ/ఓ 2015 సదస్సులో 'అన్ డూ సెండ్' ఆప్షన్ ను అతి త్వరలో ప్రవేశపెట్టనున్నామని గూగుల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.